ఇల్లు ధ్వంసం నీకే పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోండి

ఎస్ఐకి ఫిర్యాదు చేసిన బాధితుడు బాలసుబ్రమణ్యం రెడ్డి

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-

ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామంలో అధికార పార్టీ అండదండలతో కొంతమంది వ్యక్తులు ఇల్లును కూర్చిన ఘటన మండలంలో చోటుచేసుకుంది బాధితుడు మాజీ సింగల్ విండో అధ్యక్షులు బాలసుబ్రమణ్యం రెడ్డి కథనం మేరకు కొత్తపల్లి రెవెన్యూ లెక్కల దాఖల లో 2000 సంవత్సరంలో 243/3 లో 0.3 సెంటు స్థలం ప్రభుత్వం బాలసుబ్రమణ్యం భార్య కమల కు పట్టా మంజూరు చేసింది ఇందు లో రేకుల ఇల్లు నిర్మించుకున్నారు.అప్పటినుంచి ప్రభుత్వానికి కరెంటు బిల్లు ఇంటి పన్ను చెల్లిస్తున్నారు శుక్రవారం అర్ధరాత్రి ఇంటిలో ఎవరు లేని సమయం చూసుకొని జెసిబి సహాయంతో ఇంటిని ధ్వంసం చేసి అందులో ఉన్న వస్తువులు నగదు తీసుకువెళ్లినట్లు తెలిపారు. సుమారు పది లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటినట్లు బాధితుడు బాలసుబ్రమణ్యం రెడ్డి తెలిపారు దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *