మన ధ్యాస, నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామంలో ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు సల్ల ఆశన్న అంత్యక్రియలు గురువారం విషాద వాతావరణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆశన్న పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ ధర్పల్లి రాజేశ్వర్ రావు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు, అభిమానులు పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.27 సంవత్సరాల పాటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో పాత్రికేయుడిగా సేవలందించిన ఆశన్న ప్రజా సమస్యలను నిర్భయంగా, నిష్పాక్షికంగా వెలుగులోకి తీసుకువస్తూ విశేష గుర్తింపు పొందారు. ఆయన ఆకస్మిక మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు.అనంతరం ఆయన సేవలను స్మరించుకున్న పలువురు వక్తలు, ఆశన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచర పాత్రికేయులు, గ్రామస్తుల సమక్షంలో ఆశన్న అంత్యక్రియలు నిర్వహించారు.ప్రెస్ క్లబ్ పాత్రికేయులు లక్ష్మణ్ దాస్,మొహమ్మద్ షరీఫ్,పాల్ దినాకర్, మెరాజ్, రమేష్,శ్యామ్, రాజేందర్ రెడ్డి, కృష్ణ,తదితరులు తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రజా పండరి, రవీందర్ రెడ్డిలు పూలమాలవేసి నివాళులర్పించారు. నాయకులు పట్లోళ్ల దుర్గారెడ్డి, రమేష్ గౌడ్, మనోహర్, గంగారెడ్డి ,సాదుల సత్యనారాయణ ,శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *