రేణిగుంట ఆగష్టు 2.
​ఈనెల 2.8.26న ‘రాస్’ (రాస్ ) మత్తు వ్యసనపరుల పునరావాస కేంద్రం నందు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మత్తుపదార్థాలు, వాటి వ్యసనం వల్ల కలిగే తీవ్ర దుష్పరిణామాలపై ప్రధానమంత్రి స్పందిస్తూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ కలలను సాకారం చేసుకుంటూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించాలని ప్రబోధించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా యువకులు పాల్గొని చైతన్యవంతులై, మత్తు మహమ్మారి నుండి సమాజాన్ని కాపాడుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడతామని మరియు నిరంతరం మత్తురహిత సమాజం కోసం కృషి చేస్తామని ‘ఈ-ప్లెడ్జ్’ ద్వారా ప్రతిజ్ఞ చేశారు. ఈ విశేష కార్యక్రమంలో రాస్ సంస్థ సిబ్బందితో పాటు ప్రస్తుతం కేంద్రంలో చికిత్స పొందుతున్న వ్యసనపరులు, మరియు పూర్వపు వ్యసనవిముక్తి చెందినవారు పాల్గొనడం జరిగిందని రాస్ డైరెక్టర్ అన్నాదొరై తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *