నియోజకవర్గ ఇంచార్జిగా నియమితులైన తర్వాత తొలిసారి భేటీ అయిన ఇరువురు నేతలు.తిరుపతి నగర, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ.తిరుపతి నియోజకవర్గ నూతన ఇంచార్జిగా నియమితులైన జేబీ శ్రీనివాస్ ఈరోజు తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఇరువురు నాయకులు ఒకరినొకరు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి పరస్పరం ఘనంగా సత్కరించుకున్నారు.జేబీ శ్రీనివాస్ నూతన బాధ్యతలకు డాలర్స్ దివాకర్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలపగా,తుడా చైర్మన్‌గా తుడా అభివృద్ధికి అందిస్తున్న సేవలను కొనియాడుతూ జేబీ శ్రీనివాస్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ ఆత్మీయ భేటీ అనంతరం ఇరువురు నేతలు తిరుపతి నియోజకవర్గ పరిధిలోని పలు కీలక అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళి కృష్ణ , తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *