తుడా నిధులతో నూతన మురుగునీటి కాల్వల నిర్మాణానికి ఘనంగా భూమి పూజ.సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశం.తిరుపతి నగర పరిధిలోని కోర్రమేనుగుంట ప్రాంతంలో కాల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడ్డాయి.తిరుపతి నగరాభివృద్ధి సంస్థ నిధులతో నిర్మించతలపెట్టిన నూతన మురుగునీటి కాల్వల (డ్రైనేజీ) నిర్మాణ పనులకు తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి ఈరోజు శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.గత పాలనలో కోర్రమేనుగుంట ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యంతో వదిలేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక స్థానిక ప్రజలు, ఇళ్లలో మురుగునీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.కోర్రమేనుగుంట పరిసర ప్రాంతాల్లో మురుగునీరు సరిగ్గా ప్రవహించక, వర్ష కాలంలో స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి.ప్రజల ఆరోగ్య భద్రత, నగర సుందరీకరణే ధ్యేయంగా తుడా నిధులను కేటాయించి ఈ నూతన మురుగునీటి కాల్వల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం” అని చైర్మన్ పేర్కొన్నారు.గతంలో తుడాను కేవలం ఒకే ఒక్క నియోజకవర్గానికి పరిమితం చేసి రాజకీయం చేశారని,మా కూటమి ప్రభుత్వంలో తుడాను ఒకే నియోజకవర్గానికి పరిమితం చేయకుండా,తుడా పరిధిలోకి వచ్చే తొమ్మిది నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.అన్ని ప్రాంతాలకు నిధులు కేటాయించి సమగ్ర అభివృద్ధి సాధించడమే మా లక్ష్యం” అని డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, కోర్రమేనుగుంటతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా నూతన కాల్వలు, రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తామని,నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకూడదని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు మాట్లాడుతూ తుడా చైర్మన్ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.కోర్రమేనుగుంట ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న డ్రైనేజీ సమస్యపై దివాకర్ రెడ్డి కి తుడా చైర్మన్ కాగానే వినతిపత్రం సమర్పించామని తెలిపారు.మేము వినతి చేసిన వెంటనే ఆయన స్పందించి, కేవలం 2 నెలల లోపే నిధులు మంజూరు చేసి, టెండర్లు పిలిచి, ఈరోజు భూమి పూజ చేయడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చిందనీ, ఇచ్చిన మాట ప్రకారం వేగంగా స్పందించే ఇలాంటి నాయకుడు తుడా చైర్మన్ కావడం తిరుపతి ప్రజల అదృష్టం” అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్రాపాధ్యక్షుడు నరసింహ యాదవ్ , తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి , గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ , తిరుపతి తెదేపా ఇంచార్జి జేబీ శ్రీనివాస్ ,తిరుపతి మున్సిపల్ ఇంచార్జి కమిషనర్ శారద ,పులిగోరు మురళి కృష్ణ కూటమి నాయకులు, తుడా యస్ఈ రవీంద్రయ్య, తుడా,మున్సిపల్ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

