• సీపీ శంఖ బ్రత బాగ్చి.

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం జూన్ 26 :

యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడంలో క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ టూరిజం (సీసీఎ) కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత బాగ్చి అన్నారు.సంస్థ పదేళ్ల ప్రస్థానం సందర్భంగా అక్కయ్యపాలెం నర్సింహానగర్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన”మీట్,డైన్ అండ్ అన్‌వైండ్” లంచెన్,ఫుడ్ ఫెస్టివల్‌ను ఆయన సందర్శించారు.విద్యార్థులు తయారు చేసిన అంతర్జాతీయ,ప్రాంతీయ వంటకాలను పరిశీలించి, వారి సృజనాత్మకతను అభినందించారు. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు గ్లోబల్ స్థాయిలో అద్భుతమైన డిమాండ్ ఉందని,ఇలాంటి ఈవెంట్స్ వల్ల విద్యార్థుల్లో లీడర్‌షిప్, టీమ్‌వర్క్ నైపుణ్యాలు పెరుగుతాయని సీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీసీఎలో బిహెచ్ఎం,బిబిఎ చదువుతున్న విద్యార్థులందరికీ అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు లభించడంపై సీపీ హర్షం వ్యక్తం చేశారు.వీరంతా ఇంటర్న్‌షిప్ కోసం మారిషస్ వెళ్తుండటం పట్ల విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.​అనంతరం సంస్థ ఎండి టెకీ ప్రభాకర్,మేనేజింగ్ పార్టనర్ అధిబా రూహి,ప్రిన్సిపల్ లోకేశ్వరి మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి బిహెచ్ఎం,బిబిఎ, డిహెచ్ఎం,డిసిసిఎం అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ శ్రీనివాస్, సోషల్ మీడియా నెట్వర్క్ ఇంచార్జ్ నేహా ప్రభ,హెడ్ చెఫ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *