తిరుపతి జూన్ 16.
తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ లోని ఏడుకొండలు బస్ స్టాండ్, తిరుచానూరు పాయింట్ లో మరియు కపిలతీర్థం పాయింట్ లో ఆర్టీసీ బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్, కండక్టర్లకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్టార్ కృష్ణ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తూ సామాన్య ప్రజానీకాన్ని సైతం బెంబేలు ఎత్తించిన విషయాన్ని గుర్తుచేస్తూ , ఆర్టీసీ డ్రైవర్లు బస్సులో ఇంజిన్ వద్ద వేడిమికి తల్లడిల్లిపోతున్నప్పటికీ వృత్తిరీత్యా ఎంత కష్టాన్నైనా భరించి ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడంలో విజయవంతంగా తమ విధులను నిర్వర్తించు చున్నారు. అదేవిధంగా కండక్టర్లు మామూలు టికెట్స్ తో పాటు స్త్రీ శక్తి టికెట్స్ తో పనిభారం ఎక్కువైనప్పటికీ ఓపికతో భరిస్తూ తమ తమ విధులను సక్రమంగా నిర్వహించు చున్నారు. ఈ క్రమంలో మానవతా దృక్పథంతో ఈ రోజు అనగా మంగళవారం డ్రైవర్, కండక్టర్ లకు మరియు కొంతమంది ప్రయాణీకులకు కూడా చల్లని మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు, కండక్టర్లు మరియు ప్రయాణీకులు పాల్గొన్నారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *