దేశ చరిత్రలో నేటికి 4,400 రోజుల అత్యధిక కాలం ప్రధానిగా పరిపాలించిన ఘనతను సాధించిన మోడీ కి శుభాకాంక్షలు.

ముక్కంటి ఆలయంలో నరేంద్ర దామోదర దాస్ మోడీ పేరున రాహుకేతు పూజలు.
శ్రీకాళహస్తి జూన్ 11.
భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ ఇంచార్జీ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ నాయకత్వంలో ప్రియతమా ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోడీ పేరున రుద్రాభిషేకం మరియు రాహుకేతు పూజలను ఘనంగా నిర్వహించడం జరిగినది. దేశ చరిత్రలో అత్యధిక కాలం నిరంతరాయంగా దేశ ప్రధానమంత్రిగా పరిపాలించిన ఘనతను సాధించిన మోడీ నాయకత్వం వర్ధిల్లాలని ఆయాయురాగ్యాలతో పాటు మరెంత శక్తిని ప్రసాదించాలని ఆయన పేరుతో ముక్కంటీశ్వరుని ఆలయంలో భక్తీ శ్రద్ధలతో పూజలు నిర్వహించడమైనది. దేశాన్ని “సంక్షేమం-అభివృద్ధి” దేశ రక్షణతో పాటు భారత్ ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు మోడీ కి శ్రీకాళహస్తీశ్వరా స్వామీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని రుద్రాభిషేకం మరియు రాహుకేతు పూజలను ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ 7 శతాబ్దాల నాటి నెహ్రూ పేరున ఉన్న 4,398 రోజుల పరిపాలన చరిత్రను జూన్ 10న అధిగమించి నేటితో 4,400 రోజులు పూర్తి చేసుకుని, అవినీతి రహిత ప్రధానిగా ఎక్కువ కాలం పని చేసిన ఎలక్టెడ్ పీఎంగా నరేంద్ర దామోదర దాస్ మోడీ నిలిచారని కోలా ఆనంద్ తెలిపారు. భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యధిక కాలం 4,400 రోజుల ప్రయాణంలో ఒక సమర్థవంతమైన, సుసంపన్నమైన మరియు స్వావలంబన గల నవభారత నిర్మాణంలో ఒక స్వర్ణయుగం లాంటిది. కోట్లాది మంది భారతీయుల నమ్మకం, ప్రేమ మరియు అపారమైన ప్రజాదరణకు ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోడీ నేటికి 4,400 రోజుల సుదీర్ఘ సేవయే నిదర్శనమని మోడీ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ.. యావత్తు భారతావని దేశం కోసం, ధర్మం కోసం, దేశ అభివృద్ధి కోసం ఆయన బాటలో నడవాలని యువత ఆదర్శంగా పనిచేయాలని కోలా ఆనంద్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షులు వేడం కృష్ణయ్య, బాగీతి వెంకటేష్, పార్టీ నాయకులు జీవి అమర్నాథ్, చాగణం శైలజా, రామ్ ఉమా సింగ్, పుణ్యం డిల్లీ కుమార్ రెడ్డి, మద్దు వాసు యాదవ్, కన్నా వెంకటేశ్వర్లు, డక్కిలి శివ, గోవర్ధన్, వెంకటగిరి హరి, తానికొండ్ల భరత్ నాయుడు, యశ్వంత్, సురేష్ , చెందు, రమేష్ నాయుడు, నాని, నైనారు శ్రీనివాసులు, వెంకటరాయులు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *