తిరుపతి జూన్ 9.

జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మానవత్వాన్ని చాటుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంపేడు గ్రామానికి చెందిన డి.వెంకటేశ్వర్లు అనే దివ్యాంగుడు తన కదలికల కోసం వీల్ చైర్ కావాలని కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు.

​బాధితుడి పరిస్థితిని చూసి చలించిన కలెక్టర్, తక్షణమే స్పందించి వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు నిమిషాల వ్యవధిలోనే వీల్ చైర్‌ను తెప్పించి బాధితుడికి అందజేశారు.

​”తన అర్జీపై కలెక్టర్ వెంటనే స్పందించి, అక్కడికక్కడే వీల్ చైర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నా ఇబ్బందులు తీర్చిన కలెక్టర్ కృతజ్ఞతలు.”

డి.వెంకటేశ్వర్లు (బాధితుడు)

​ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, గ్రీవెన్స్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *