బుచ్చిరెడ్డిపాలెం జులై 24 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రం లో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మకు ఆషాఢ మాసంలో భక్తులు కొత్త చీరలు, పసుపు, కుంకుమ,గాజులు, మరియు మంగళకరమైన వస్తువులను సారె రూపంలో సమర్పిఇచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ప్రచార ప్రముక్ భయ వాసు శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారిని తమ సొంత ఇంటి ఆడపడుచుగా భావించి ఈ ఆచారాన్ని ప్రతి ఏటా చాలా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.ఆషాఢ సారె విశేషాలుగ్రామోత్సవం.సమర్పణ: ఆషాఢ మాసంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో బృగాలుగా వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారు.శాకాంబరీ ఉత్సవం: ఆషాఢ మాస శుక్ల పక్ష త్రయోదశి నుండి పౌర్ణమి వరకు అమ్మవారు శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు.సారె వస్తువులు: పసుపు, కుంకుమ, రవికె గుడ్డ, జాకెట్లు, గాజులు, అలంకరణ సామగ్రిని భక్తులు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు అని వారు తెలియజేశారు.ఈ క్రమంలో బుచ్చి ఖండ ధర్మ ప్రచారక్ శ్రీనివాసులు, ఖండ కన్వీనర్ విజయకృష్ణ, మరియు సుప్రజ, జోన్ ధర్మ ప్రచారక్ వెంగల్ రెడ్డి, జిల్లా ధర్మ ప్రచారక్ భాస్కర్.లు పాల్గొన్నారు.
