పాండిచ్చేరి సీఎం ను సన్మానించిన ఢిల్లీ బాబు రెడ్డి……

రేణిగుంటజూన్ద్ 9.కేంద్రప్రభుత్వంతో చర్చించి జర్నలిస్టు సమస్యలను పరిష్కరించాలని పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి కోరారు. పాండిచ్చేరిలోని సీఎం రంగస్వామిని కలుసుకొని శాలువాతో ఘనంగా సత్కరించి ఢిల్లీ బాబు రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ బాబు రెడ్డి మాట్లాడుతూ దాదాపు ఒక దశాబ్దం తరువాత గౌరవపాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ని కలవడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్ట్ సమస్యలపై భారత జర్నలిస్ట్ సంఘం ప్రతినిధిగా చర్చించడం జరిగిందన్నారు. జర్నలిస్ట్ సమస్యలపై సానుకూలంగా స్పందించారనీ పేర్కొన్నారు. సీఎం రంగస్వామితో నాకు రెండు దశాబ్దాలుగా చిరు పరిచయం ఉందన్నారు. చిన్న రాష్ట్రమైనా మన ఆంధ్రప్రదేశ్ తో అనుబంధం కలిగిన రాష్ట్రం కనుక అనేక విషయాలపై వారికి సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. పాండిచ్చేరి సీఎం కార్యాలయంలో వారిని కలిసి సత్కరించి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ యొక్క ఘనతను తెలియజేసామన్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గా ఉన్న ఢిల్లీ బాబు రెడ్డి ప్రతిపాదనలను సానుకూలంగా స్పందించి కేంద్రంతో ఖచ్చితంగా చర్చించి తెలియజేస్తానన్నారు. ఈ సందర్భంగా సీఎం రంగస్వామి సానుకూలంగా స్పందించినందుకుగాను ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *