రేణిగుంట, జూన్ 6.

మహిళా సంఘం నాయకురాలినని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు తనను ఒక పథకం ప్రకారం ట్రాప్ చేసి, తన పెళ్లిని చెడగొట్టారని తిరుపతి రైల్వే వర్క్‌షాప్ ఉద్యోగి రవి ఆరోపించారు. గురువారం రేణిగుంటలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన తన బాధను మీడియా ముందు చెప్పుకున్నారు.పెళ్లి చెడగొట్టి, బ్లాక్‌మెయిల్..
బాధితుడు రవి తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన ఉషారాణి అనే మహిళ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలిగా పరిచయమైంది. ఆ తర్వాత ఆమె కొందరితో కలిసి తనపై నిఘా ఉంచి, ఒక ట్రాప్‌లో పడేసింది. తద్వారా రవికి జరగాల్సిన వివాహాన్ని చెడగొట్టడమే కాకుండా, రైల్వే ఎస్.ఆర్ లో భార్య స్థానంలో ఆమె పేరు చేర్చాలని ఒత్తిడి తెచ్చారు. ఉద్యోగం కోసం తనను చంపేందుకు కూడా ప్లాన్ చేశారని రవి ఆరోపించారు.గతంలోనూ పలువురిపై కేసులు..
రవి ఈ విషయంపై ఆరా తీయగా ఉషారాణికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెకు 2007 లోనే విశ్వనాథ్ అనే వ్యక్తితో వివాహం కాగా, అతనితో పాటు కుటుంబ సభ్యులు మొత్తం ఎనిమిది మందిపై 498/ఎ మరియు మెయింటెనెన్స్ కేసులు పెట్టి వేధించింది. ఆ తర్వాత చంద్రశేఖర్ అనే మరో వ్యక్తిని వివాహం చేసుకుని అతనిపై కూడా ఇలాంటి కేసులే పెట్టిందని, వీటికి సంబంధించిన కోర్టు తీర్పు కాపీలు తన వద్ద ఉన్నాయని రవి మీడియాకు చూపించారు.బెదిరింపులు – సామాన్ల దొంగతనం..
ఇంకా విడాకులు కాకపోయినా తనతోనే ఉండాలంటూ ఉషారాణి, సిపిఐ పార్టీకి చెందిన ఓ నగర అధ్యక్షుడు, మరియు మరో మహిళా సంఘం నాయకురాలు కలిసి తనను తీవ్రంగా వేధిస్తున్నారని రవి పేర్కొన్నారు. తన నుంచి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని, నిరాకరించడంతో రేణిగుంటలోని తన రూమ్‌లోకి చొరబడి సామాన్లను దొంగిలించారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిని, తనను చంపేస్తామని బెదిరించడంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని తెలిపారు.న్యాయం చేయాలని వేడుకోలు:
ఈ ముఠా బారి నుండి తనకు, తన తల్లికి రక్షణ కల్పించాలని.. తిరుపతి ఎస్పీ, రేణిగుంట పోలీసులు మరియు కూటమి నాయకులు లోకేష్, పవన్ కళ్యాణ్ స్పందించి తనకు న్యాయం చేయాలని రవి వేడుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *