కలిగిరి జూన్ 06మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
కలిగిరి లో స్థానిక సిపిఆర్ కళ్యాణ మండపంలో స్వర్ణ బేబీ ప్రిన్సి తొలి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణ లలితమ్మ, దాసు దంపతుల ముద్దుల మనుమరాలు, స్వర్ణ విజన్య – స్మైలీ (నవ్య) దంపతుల కుమార్తె అయిన బేబీ ప్రిన్సి తొలి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ తొలి సంతానం జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన బంధువులు, మిత్రులు బేబీ ప్రిన్సికి దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందించారు.అనంతరం పాస్టర్ ఎనుముల ఏసుబాబు, సంఘ కాపరి జకరియా, పాస్టర్ జి. జై ప్రసాద్, సంధ్యారాణి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బేబీ ప్రిన్సి ఆయురారోగ్యాలతో, దేవుని దీవెనలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.