రేణిగుంట:
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తుకివాకం పంచాయతీ ఎస్.ఎన్.పురం గ్రామానికి చెందిన ప్రతిభావంతమైన క్రీడాకారిణి పీ. గ్రేసీ జాతీయ స్థాయి కేడెట్ జూడో ఛాంపియన్‌షిప్‌కు రాష్ట్ర జట్టులో ఎంపికైంది. ఈమె ఎంపిక కావడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు చండీగఢ్‌లో జరిగే జాతీయ పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈ సందర్భంగా ఏఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి. ఆనందరావు ఆమెను ఘనంగా సన్మానించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పీ. గ్రేసీ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకుని రాష్ట్రానికి కీర్తి తీసుకురావాలని గ్రామస్థులు, క్రీడాభిమానులు ఆకాంక్షించారు.
ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి:
జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారిణికి స్పాన్సర్‌షిప్ లేదా ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సహాయం చేయదలచిన వారు 8374853016 నంబర్‌ను సంప్రదించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
