మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ – ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై అవగాహన సమావేశంలో తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్-ఆఫీషియో సభ్యుడు, టీడీపీ తిరుపతి జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ , పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

త్వరలో భారత ఎన్నికల సంఘం చేపట్టనున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమం నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఇతర కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *