తిరుపతి మే 28 :
తెలుగుదేశం పార్టీలో రామదాసు ముని రామయ్య మూడు దశాబ్దాలకు పైగా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న క్రమశిక్షణ గల సైనికుడు అని తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్, టిడిపి రాష్ట్ర సీనియర్ నేత పులిగోరు మురళీకృష్ణా రెడ్డి కొనియాడారు. గురువారం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని రామదాసు ముని రామయ్య ను తెలుగుదేశం పార్టీ నేతలు పులిగోరు మురళి కృష్ణారెడ్డి నేతృత్వంలో శాలువతో ఘనంగా సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామదాసు ముని రామయ్య 30 ఏళ్లకు పైబడి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయడంతో పాటు, నగరపాలక సంస్థ ఎన్నికలలో కార్పొరేటర్ల గెలుపు కోసం తన వంతు కృషి చేస్తూ పార్టీ ముఖ్య నేతల దృష్టిలో పడ్డారు. ఆయన గతంలో మూడు పర్యాయాలు తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు డైరెక్టర్ గా కొనసాగి బ్యాంకుకు వచ్చే కస్టమర్లకు సేవలందిస్తూ వారందరి చేత మన్ననలను పొందారు. ఇటీవల టిడిపి తిరుపతి పార్లమెంట్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా మునిరామయ్యకు పార్టీ అధిష్టానం పదవి కట్టబెట్టారని తెలిపారు. ఏది ఏమైనా ముని రామయ్య లాంటి సిన్సియర్ కార్యకర్తలు తిరుపతి నియోజకవర్గంలో ఎంతోమంది ఉన్నారని, వారిలో కొంతమందిని మహానాడు ను పురస్కరించుకొని ఎన్టీఆర్ జయంతి రోజున సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సూరా సుధాకర్ రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్ నాయుడు, ఈతమాకుల హేమంత్ యాదవ్, చింత భరణి యాదవ్, గెంజి సుధాకర్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.