

మన న్యూస్:తిరుపతి, డిసెంబర్ 17:స్థానిక పాఠశాల అయిన బాలచంద్రా మెమోరియల్ హై స్కూల్ విద్యార్థులు జంప్ రోప్ ఆటలో ఉత్తమ ప్రతిభను చాటారు. డిసెంబర్ నెల 14,15వ తేదీల్లో సత్యసాయి జిల్లాలో నిర్వహించిన 5th సబ్ జూనియర్ స్టేట్ మీట్ పోటీల్లో బాలచంద్ర మెమో రియల్ స్కూల్ (బిసిఎం) విద్యార్థులు 5 బంగారు పథకాలు,4 వెండి పథకాలు,5 కంచు పథకాలు సాధించారు. ఈ నేపథ్యంలో పాఠశాల నందు అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలియ చేసారు.పాఠశాల వ్యవస్థాపకుడు కృష్ణమూర్తి నాయుడు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇదేవిధంగా అనేక పోటీ లలో పాల్గొని మరెన్నో విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాం క్షించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ప్రియ మాట్లాడుతూ విద్యార్థుల్లో మరింత కృషి,పట్టుదల అలవర్చుకోని రానున్న పోటీల్లో మంచి విజయాన్ని సాధించాలని కోరారు.కార్యక్రమంలో భాగంగా ప్రిన్సి పాల్ సుకన్య, వ్యాయామ ఉపాధ్యా యురాలు ప్రమీన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.