మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని చిన్న అరేపల్లి గ్రామంలో నల్ల పోచమ్మ ముత్యాల పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం హోరాహోరీగా కుస్తీ పోటీలను నిర్వహించారు. కుస్తీ పోటీలో గెలుపుపొందిన మల్లయోధులకు సర్పంచ్ మోహన్, గ్రామ కమిటీ అధ్యక్షులు వసంతురావు పటేల్ లు నగదును అందజేశారు.ఆఖరికి కుస్తీ 5000 రూపాయలను అందజేసినట్లు తెలిపారు. గ్రామంలో కుస్తీ పోటీలను తిలకించేందుకు జహీరాబాద్, నారాయణఖేడ్ ,మహారాష్ట్ర ,కర్ణాటక, తదితర ప్రాంతాల నుంచి ప్రజలు మరలయోధులు తరలివచ్చారు.రెండు సంవత్సరాల నుంచి బారేడు పోచమ్మ ,ముత్యాల పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది.కుస్తీ పోటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.