మన ధ్యాస నిజాంసాగర్ (జుక్కల్) :నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్‌నగర్ గ్రామ శివారులో గల బారడి పోచమ్మ తల్లి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు.నిర్వహించిన పోటీల్లో మల్లయోధులు తమ ప్రతిభను కనబరిచి ప్రేక్షకులను అలరించారు.కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, జహీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి మల్లయోధులు,ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మల్లయోధుల మధ్య జరిగిన పోటీలు ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి.పోటీల్లో విజేతలుగా నిలిచిన మల్లయోధులకు సుల్తాన్‌నగర్ సర్పంచ్ వడ్ల బ్రహ్మం నగదు బహుమతులను అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిపాల్ రెడ్డి, కూర్మ సాయిలు, సయ్యద్ షర్ఫుద్దీన్, ఎర్ల బ్యాతయ్య, సయ్యద్ హుసేని, ఈశ్వర్, ఎర్ల శ్రీనివాస్, చాంద్ పాషా, షేక్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.
