రేణిగుంట పూతలపట్టు,15.05.2026: యువతకు నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పూతలపట్టు మండలం, పెటమిట్ట నందు గల అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నేషనల్ అప్రెంటిసిషిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) కింద ప్రభుత్వం ఆమోదించిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్మీడియట్ పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 16 సంవత్సరాలు పూర్తై 30 సంవత్సరాలు మించకూడదని తెలిపారు.
శిక్షణ కాలంలో అభ్యర్థులకు సుమారు రూ.13,392 వరకు స్టైపెండ్ అందజేయబడుతుందని తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం ప్రభుత్వం చేత ఆమోదించబడిన సర్టిఫికెట్ కూడా అందజేయబడుతుందని వెల్లడించారు.
నైపుణ్యాలను పెంపొందించుకొని మంచి ఉపాధి అవకాశాలను పొందేందుకు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 25-05-2026
ఇతర వివరాల కొరకు 9100477371 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
