సాంకేతిక ఆధారాల తో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేసిన సీఐ మంజునాథ్ రెడ్డి…

రేణిగుంట మే 11
తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ (నేరాలు) ఆర్ల శ్రీనివాస్ పర్యవేక్షణలో, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో రేణిగుంట రూరల్ సీఐ ఎం. మంజునాథ్ రెడ్డి మరియు గాజులమండ్యం ఎస్సై హరీష తమ సిబ్బందితో కలిసి రాగి వైర్లు దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు.
​గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రమరెడ్డిపాలెం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కంపెనీలో జరిగిన రాగి వైర్లు, కాపర్ బస్ బార్లు మరియు ఇతర కాపర్ సామగ్రి చోరీ ఘటనపై సీఐ మంజునాథ్ రెడ్డి, ఎస్సై హరీష ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సీసీటీవీ దృశ్యాలు, టోల్ ప్లాజా వివరాలు మరియు సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టి తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన అనిత, సరసు, హిందు అలియాస్ సిందు, ఇల్లవారాసి అలియాస్ అమ్ము జనిఫా, మణికండన్, ఆనందబాబు అలియాస్ ఆనంద్ అలియాస్ సోట్ట, కుమార్ శబరి అలియాస్ సచిన్ అనే ఏడుగురు నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
​ఈ అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు గతంలో దొంగతనం చేసిన సొత్తును అమ్ముకొని, మళ్లీ దొంగతనాలకు పాల్పడేందుకు తిరుపతికి వచ్చినట్లు విచారణలో తేలిందని సీఐ వెల్లడించారు. నిందితుల నుంచి 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సిఐ మంజునాథరెడ్డిని ఎస్సై హరీష మరియు పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారని ఆయన తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *