తిరుపతి ప్రజల ఆరాధ్య దైవం, గ్రామదేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ఆదివారం అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో పట్టు వస్త్రాలు, సారేను సమర్పించారు.
అనంతరం భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని భక్తులకు అంబలిని అందజేశారు.
ఎండల తీవ్రత దృష్ట్యా జాతరకు వచ్చే భక్తులకు ఉపశమనం కలిగించేందుకు అంబలి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు ఎస్ ఈ రవీంద్రయ్య సీపిఓ దేవికుమారి భూసేకరణ అధికారి సుజన ఏపీఓలు, జేపీఓలు, ఏవో శైలజ తదితరులు పాల్గొన్నారు.





