రేణిగుంట మన ధ్యాస మే 10.

తుడా కార్యాలయం నుండి ఆలయం వరకు సాగిన సారే ఊరేగింపు. తిరుపతి పురవీధుల్లో జాతర సందడి మిన్నంటింది,ఆధ్యాత్మికతకు, సంస్కృతికి అద్దం పట్టింది.తీన్మార్ డప్పులు హోరుతో మారుమోగిన తిరుపతి పురవీధులు. తిరుపతి ప్రజల ఆరాధ్య దైవం, తాతయ్యగుంట గంగమ్మ తల్లి గంగ జాతర పురస్కరించుకుని లోకమాత, తిరుపతి గ్రామదేవత శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి అంగరంగ వైభవంగా సారే ను సమర్పించారు.తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తుడా అధికారులు,ఉద్యోగాలతో కలిసి సారే ను సాంప్రదాయబద్ధంగా ఊరేగింపు గా తీసుకువెళ్ళి అమ్మవారికి పట్టువస్త్రాలు,పసుపు-కుంకుమ,గాజులు మరియు వివిధ రకాల ఫలాలను సమర్పించారు.ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:తిరుపతి పుర ప్రజలందరినీ చల్లగా చూసే కరుణామయి గంగమ్మ తల్లి. ఈ జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఇది మన సంస్కృతికి ప్రతీక.తుడా అభివృద్ధి పథంలో పయనించాలని, జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ తల్లిని ప్రార్థించనని తెలిపారు.ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు, ఎస్ ఈ రవీంద్రయ్య, సీపిఓ దేవికుమారి, భూసేకరణ అధికారి సుజన, ఏపీఓలు, జేపీఓలు, ఏవో శైలజ, వారి కుటుంబ సభ్యులు,కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *