కొండాపూరం, మే 07, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

పదో తరగతి వార్షిక పరీక్షల్లో 585 మార్కులు సాధించిన శివ ప్రతాప్ ను అభినందించిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి , కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్ గారు.

ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో కొండాపురం మండలంలో మొదటి స్థానం(1st ప్లేస్ )సాధించిన కొమ్మి గ్రామానికి చెందిన కొమ్మి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన వినుకొండ శివ ప్రతాప్ ఈరోజు కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్ ని ట్రస్ట్ కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులతో వచ్చి కలిశారు. అనంతరం ట్రస్టు సభ్యులు ప్రతాప్ ను సన్మానించి, ఆర్థిక సాయం అందించి రానున్న రోజుల్లో చదువులో ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరారు. అదేవిధంగా ప్రతాప్ కు ఎటువంటి సహాయం కావాలన్నా సంప్రదించాలని నవీన్ కోరారు. విద్యార్థులను ప్రోత్సహించడంలో ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ కుటుంబ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు వెంకటసుబ్బయ్య, కాజా మస్తాన్, బీసీ నాయకులు రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *