తాశీల్దార్ శ్యామ్ ప్రసాద్…
రేణిగుంట మే 2.
రేణిగుంట మండల ప్రజలందరికీ తహశీల్దార్ శ్యామ్ ప్రసాద్ తెలియజేస్తున్నది ఏమనగా, మే 4, 2026 సోమవారం నాడు రేణిగుంట తహశీల్దారు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించబడుతుంది కావున మండల స్థాయి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు తిరుపతి కలెక్టరేట్‌కు వెళ్లకుండా మొదటగా ఇక్కడి అధికారులనే సంప్రదించాలని, అన్ని శాఖల అధికారులు ఒకే చోట అందుబాటులో ఉంటారని, ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికీ రశీదు అందజేయబడుతుందని, ఒకవేళ నిర్ణీత కాలపరిమితిలో సమస్య పరిష్కారం కాకపోతే ఆ రశీదు ద్వారా తదుపరి విచారణ చేయవచ్చని, కేవలం జిల్లా కలెక్టర్ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యల కోసం మాత్రమే తిరుపతి వెళ్లాలని కోరుతూ, ప్రజలందరూ తమ వద్ద ఉన్న తగిన ధ్రువ పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేస్తున్నారు
