మంగళగిరి, ఏప్రిల్ 29, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ని మాజీ ఒంగోలు డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాసులు సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ, పార్టీ పట్ల బొల్లినేని వెంకట రామారావు నిబద్ధత,నాయకత్వం వల్ల ఈ పదవి దక్కిందని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.అనంతరం బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ, పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.