మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఏప్రిల్ 28 ,మహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బోయిని హరిన్ కుమార్, ఐకెపి సీసీ శ్రీకాంత్‌లు కలిసి కొబ్బరికాయ కొట్టి, ధాన్యం బస్తాను తూకం యంత్రంపై ఉంచి ఘనంగా ప్రారంభించారు.అనంతరంఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రైతులు తమ కష్టార్జిత పంటను దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు న్యాయమైన ధర అందించేందుకు మద్దతు ధరలను ప్రకటించిందన్నారు. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాల్‌కు ₹2,389, బి గ్రేడ్ వరి ధాన్యానికి ₹2,369 చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లాభపడాలని కోరారు.
కొనుగోలు కేంద్రంలో రైతులకు త్రాగునీరు, నీడ, తూకం యంత్రాలు, ధాన్యం నిల్వ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. రైతులు ధాన్యం తేమ శాతం, నాణ్యత ప్రమాణాలు పాటించి కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ధ్యామగారి ఆగమయ్య, బంజ ఆగమయ్య,విఠల్, నర్సింలు, గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు మంగలి లక్ష్మి,
మహిళా సంఘ సభ్యులు, బంజ కమల, గ్రామ పెద్దలు, తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *