బంగారుపాళ్యం, మన ధ్యాస,ఏప్రిల్ 17.

బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం రైతు నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మామిడి రైతులకు 6.5 కోట్ల మామిడి కవర్ల పంపిణీకి సహకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.కలెక్టర్ సుమిత్ కుమార్ ఇంతకు మునుపు ఎప్పుడు లేని విధంగా రైతుల పక్షపాతిగా గత సంవత్సరం తీవ్రంగా శ్రమించి రైతులకు ప్రభుత్వం నుండి సబ్సిడీని అందజేయడం మొదలుకొని, ఫ్యాక్టరీలకు సరైన సమయంలో అనుమతులు మంజూరు చేసి సకాలంలో ఫ్యాక్టరీలు పనిచేసే విధంగా చేసి రైతులకు మేలు చేశారని కొనియాడారు. మామిడి కవర్ల పంపిణీలో కలెక్టర్కు సహకరించిన అగ్రికల్చర్ ఎడి రామాంజనేయులు మరియు హార్టికల్చర్ ఆఫీసర్ కోటేశ్వరరావు లకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే జిల్లాలో యూరియా పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ను కోరారు.ఈకార్యక్రమంలో రైతు నాయకులు ఆవుల శాంతమూర్తి,తోట వేణుగోపాల్,పి.కిరణ్,పి.పవన్,ఆవుల మునిరత్నం, హిందు బాబు,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *