మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రతి గింజలు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి, సుల్తాన్ నగర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లు కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. ఏ గ్రేడ్ రకం వరి ధాన్యానికి క్వింటాలకు రూ.2389లు బీ గ్రేడ్ రకానికి రూ.2369లు మద్దతు ధరతో పాటు సన్న రకం ధాన్యానికి ప్రోత్సాహకంగా క్వింటాకు 500 రూపాయలు బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ ,ఐకెపి ఎపిఎం ప్రసన్నారాణి,సర్పంచ్ వడ్ల బ్రహ్మం,నాయకులు ప్రజా పండరీ, అనిస్ పటేల్, మంద బలరాం, గుర్రపు శ్రీనివాస్,మెగారం శ్రీనివాస్,చాకలి సాయిలు,గాండ్ల రమేష్,అజర్,కృష్ణ మూర్తి,హుసేని,ఐకెపి సిసి సాయిలు,తదితరులు ఉన్నారు.
