మన ధ్యాస :- నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ మనోహర్ ను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, నగర నేత కే. వేణుగోపాల్, రుయా ఆసుపత్రి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతలు గురవయ్య, మునిచంద్ర, నరసింహులు, కాంచన, కుమార్, రాధ తదితరులు సోమవారం నాది ఉదయం ఆయన చాంబర్లో కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా రుయా సూపరింటెండెంట్ మనోహర్ మాట్లాడుతూ తాను ఇక్కడే విద్యార్థిగా, అధ్యాపకునిగా, వైద్యునిగా, సూపరింటెండెంట్ గా పనిచేసే అదృష్టం దొరికిందని తాను కిందిస్థాయి నుంచి ఎదిగిన మనిషినని ప్రజలకు ఉద్యోగులు కార్మికులకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి ఆసుపత్రి అభివృద్ధికి తోడ్పడుతానని ఈ కృషిలో తనకు అన్ని పక్షాలు మద్దతునిచ్చి బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *