తిరుపతి.
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలం, మంగళం తిరుమలనగర్ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమైంది. తిరుమలనగర్ పంచాయతీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ,చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని సమక్షంలో చేరికల కార్యక్రమం జరిగింది. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ,ఎమ్మెల్యే పులివర్తి నాని , తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందని, అందరూ కలిసికట్టుగా ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని, నేడు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడం శుభపరిణామమని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరడం పట్ల కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసి ,నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ విధానాలకు ఆకర్షితులై తాము తెదేపాలో చేరినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల తెదేపా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగు మహిళా విభాగం నేతలు మరియు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

