మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన పవిత్ర హోమ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగానిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని,భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరై హోమం,పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వయంగా హోమంలో ఆహుతులు సమర్పించి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధార్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడమే కాకుండా శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్ ,ఉప సర్పంచ్ మేంగారం కవిత పండరి, నాయకులు గుర్రపు శ్రీనివాస్, గుర్రపు వెంకటేశం, మేంగారం సాయిలు,మేంగారం పండరి, కమ్మరి కత్త అంజయ్య, మేంగారం శ్రీనివాస్, బంగ్లా ప్రవీణ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.