మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ సీమ షెట్కర్, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి కలిసి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దర్పల్ గంగాధర్, గులాం సంధాని, ముజాహిద్, నౌషా నాయక్, మారుతి, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *