కావాలి, మార్చి 10,(మన న్యూస్ ప్రతినిధి)నాగరాజు కె.
కావలి ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం మార్చి 8 పురస్కరించుకుని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో సభ నిర్వహించారు ఈ సభకు అధ్యక్షత వై ప్రభావతి వహించారుఈ సందర్భంగా మహిళా సమైఖ్య జిల్లా కన్వీనర్ వినోదిని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం శ్రామిక వర్గ మహిళలపై పని భారాన్ని మోపుతూ శ్రమను దోచుకునేందుకు అదనపు పని గంటలు పెంచుతూ కార్పొరేటర్లకు ఊడిగం చేసే విధానాలను అవలంబిస్తున్నారని జాతీయ గ్రామీణ ఉపాధి పేరు మార్చి బడ్జెట్లో కోతలు విధిస్తూ ఉపాధి హామీ రద్దుకు కుట్ర పన్నుతున్నారని మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కూడా చట్టంలో మార్పులు చేస్తున్నారని చట్టసభల్లో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన అమలు కావడం లేదని మహిళలకు రక్షణ కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని అత్యాచారాలు హత్యకు గురి అవుతున్నారని చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని శిక్షలు సరిగా పడకపోవడంతో నేరాలు జరుగుతున్నాయని కఠిన చట్టాలు తేవాలన్నారు శ్రామిక మహిళల ఉపాధిపై రాడులు విచ్చలవిడిగా పెరిగాయని హంతకులను నేరస్తులకు పూలదండలు వేసి ఊరేగింపు చేస్తున్నారని శ్రామిక మహిళ ఉపాధి పై దాడికి వ్యతిరేకంగా పోరాటాలు అన్నారు ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జిలాని ఖాన్ మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులేషన్ చేయాలని మహిళలకు పని హక్కు గ్యారెంటీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని lకూటమీ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇళ్ల స్థలం కేటాయించాలని ఆడబిడ్డ నిధి ఇవ్వాలని గ్యాస్ పెట్రోల్ నిత్యవసర వస్తువు ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయని కల్తీ మద్యం గంజాయి డ్రగ్స్ పిచ్చలవిడిగా సరఫరా అవుతుంది అని ప్రభుత్వం నియంత్రించాలని మహిళలు సామాజిక రాజకీయ చైతన్యం పెంపొందించుకోవాలని సామాజిక రుక్మతలపై గొంతేతాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి వి శ్రీలక్ష్మి కె లక్ష్మమ్మ వి పోలమ్మ బండి అంకమ్మ శాంతి కుమారి వై ఆదినారాయణ తన్నీరు వెంకటేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మళ్లీ అంకయ్య సిపిఐ నాయకులు చెవూరు కొండయ్య పిల్లా పురుషోత్తం యాదాద్రి రెడ్డి మారుతీ రావు సిపిఐ కావలి నియోజకవర్గం సహాయ కార్యదర్శి దమ్ము దుర్గాబాబు వెంకట్రామయ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు