రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యం..!రైతు సంక్షేమమే ధ్యేయం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

జలదంకి మార్చి 8,మన న్యూస్, ప్రతినిధి,(నాగరాజు కె).

జలదంకి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ,సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఎమ్మెల్యే తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వ సహకారం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు తమ పండించిన ధాన్యాన్ని నేరుగా విక్రయించుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. మధ్యవర్తుల వల్ల రైతులు నష్టపోకుండా, సరైన ధర అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా డలారి వ్యవస్థను నిర్మూలించి రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ సహకారం మరియు అధికారుల సమన్వయంతో సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు తమ పంటను నేరుగా విక్రయించడంతో వారికి తగిన మద్దతు ధర లభిస్తుందని, రైతు కష్టానికి గౌరవం దక్కేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *