సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని భాష్యం వంశీ చౌదరి డిమాండ్.
బంగారుపాళ్య0,మన ధ్యాస, ఫిబ్రవరి5
బంగారుపాళ్యం మండలం గుంతూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని ఆకతాయులు తరచూ గోడలు దూకి మరుగుదొడ్లను ధ్వంసం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పిల్లలు ఉపయోగించే మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉన్నప్పటికీ వాటిని విరగొట్టి లోపల విధ్వంసానికి పాల్పడటం పట్ల గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై స్పందించిన భాష్యం వంశీ చౌదరి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి పరచేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, కొందరు దుండగులు ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. పాఠశాలలు మన పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తున్న ఆలయాలంటూ, వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు గుంతూరు ప్రభుత్వ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులను వంశీ చౌదరి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తి అన్నది ప్రజల ఆస్తి అనే విషయాన్ని గుర్తించి, ఇలాంటి దారుణ చర్యలకు పాల్పడే వారు ఒకసారి ఆలోచించాలని భాష్యం వంశీ విజ్ఞప్తి చేశారు.