బంగారుపాళ్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 23
చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజవర్గం, బంగారుపాళ్యం మండల టిడిపి కార్యాలయంలో సోమవారం మై టిడిపి యాప్ పై అవగాహన కార్యక్రమం మండల టిడిపి అధ్యక్షుడు ఎన్. పి.ధరణి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు, మై టిడిపి యాప్ ను ఏ విధంగా సద్వినియోగం చేసుకోలో వివరించారు. ప్రతి గ్రామానికి టిడిపి యాప్ బ్యానర్ అందజేయడం జరుగుతుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండలంలోని క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇన్చార్జీలు, బూత్ ఇన్చార్జీలు ,గ్రామ కమిటీ నాయకులు , సర్పంచులు ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.