మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు సక్రమంగా ఉండేలా చూడాలని భాన్స్ వాడ డిఎల్పిఓ ప్రసాద్ రావు అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. గ్రామపంచాయతీ రికార్డులల్లో ఎప్పటికప్పుడు టాక్స్,నల్ల బిల్లులు, హాజరులో ప్రతిరోజు సంతకం చేయాలని పంచాయతీ కార్యదర్శి శిరీషకు సూచించారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో వాటర్ డే సందర్భంగా డిఎల్పి ప్రసాద్ రావు మొక్కలకు నీరు పోశారు, పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోకుండా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిని హరిణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నిఖిల్ ,గాలిపూర్ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ,ఫీల్డ్ అసిస్టెంట్ క్యాస బాలరాజు, కారోబార్ లింగాల రాములు,తదితరులు ఉన్నారు.
