తవణంపల్లి జనవరి 14 మన ద్యాస
తవణంపల్లి మండలంలోని దిగువతడకర పంచాయతీ దిగువతడకర గ్రామం నందు దిగువ తడకర యూత్ టీం ఆర్గనైజర్ అరుణ్ కుమార్, నవీన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంటులో యువకులు పాల్గొనడం జరిగింది. అనంతరం టీం ఆర్గనైజర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ అందరూ కూడా స్నేహపూర్వక వాతావరణంలో పాల్గొని గెలుపు ఓటములకు అతీతంగా క్రీడా స్ఫూర్తితో మెలగాలని కోరారు. క్రికెట్ టోర్నమెంట్లో ఐదు టీములుగా పోటీపడుతున్నదని ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన వారికి బహుమతిగా కప్ అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం యువకులు ఉత్సాహంగా సంక్రాంతిని గుర్తు చేసుకుంటూ క్రికెట్ టోర్నమెంట్ లో పోటీలో పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్ లో రెండు టీములు నిలిచాయి. వీరిలో విన్నర్స్ గా ప్రవీణ్,ప్రసాద్, రాయుడు,ప్రశాంత్, చరణ్,నితిన్, లోహిత్,చిన్ను, సోము,మునికృష్ణ జైవంత్ కార్తీక్,మొదటి ప్రైజ్ లో కప్ సొంతం చేసుకున్నారు. రెండవ టీం రన్నర్ గా హేమంత్, ప్రభాకర్, సతీష్, భరత్, నవీన్, రేవంత్, కార్తీక్, సూర్య, యువరాజ్, వంశీ,ద్రోణ, యశ్వంత్, ప్రశాంత్, వీరు రెండవ బహుమతి గెలుచుకోవడం జరిగింది. అనంతరం గెలుపొందిన రెండు టీం లను టీం ఆర్గనైజర్ అరుణ్ కుమార్ అభినందించి భరోసా నిచ్చారు.
