మన ధ్యాస,నెల్లూరు,జనవరి 14: నెల్లూరు నగరం రంగానాయుకుల పేట లో సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం మైదానము నందు సెయింట్ ప్రీమియర్ లీగ్ 14వ తేదీ నుంచి 17వ తేదీ దాకా జరుగు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి టాస్ వేసి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు.ఈ సందర్బంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ……….నెల్లూరు సిటీ నుంచి నాలుగు జట్లుగా తలపడుతున్న సెయింట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న వివేక్,సునీల్,సుభాష్;హేమంత్,ఆజాద్,బన్నీలకు అభినందనీయం అని అన్నారు.యువ క్రీడాకారులకు వేదిక కల్పించిన నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మొబైల్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల వైపు యువత మళ్లాలి.క్రీడల్లో పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి అని అన్నారు.ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న అన్ని జట్లకు శుభాభినందనలు తెలియజేశారు.గెలుపు ఓటమికన్నా ఆటతీరు, క్రీడాస్ఫూర్తే ముఖ్యమని గుర్తు చేస్తున్నాం అని అన్నారు.జనసేన పార్టీ ఈ దిశగా ఎప్పుడూ అండగా ఉంటుంది అని తెలిపారు.
