మన ధ్యాస, తోటపల్లి గూడూరు, జనవరి 14 :ఆల్తూరు మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డితో కలిసి ప్రారంబోత్సవాలు చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.మొదట వారి తండ్రి ఆల్తూరి ఆదినారాయణరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.పాపిరెడ్డిపాళెం సెంటర్ లో నిర్మించిన బస్ షెల్టర్ తో పాటు తోటపల్లిగూడూరు లింక్ రోడ్డులో ఏర్పాటు చేసిన వీధిలైట్లు, ఐ లవ్ పాపిరెడ్డిపాళెం నేమ్ బోర్డును ప్రారంభించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.పాపిరెడ్డిపాళెంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు సొంత నిధులతో స్వగ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న ఏఎంఆర్ సోదరులకు సోమిరెడ్డి అభినందించారు.ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాన్ని కూడా త్వరలో చేపడతామని వెల్లడించారు.



