

మన న్యూస్ పాచిపెంట, డిసెంబర్ 9: ఖరీఫ్ సీజన్లో వరి అధిక దిగుబడి రావడంతో రైతులు ఆనందంలో వున్నారు.పాంచాలి గ్రామంలో రైతు కొల్లా సత్యనారాయణ పండించిన చిరు సంచుల రకం ఆర్ జి ఎల్ 70 39 పంట కోత ప్రయోగంలో 40 బస్తాలు దిగుబడి రికార్డు అయిందని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు విలేకరులకు తెలిపారు. సాధారణ ఆర్జిఎల్ 7029 రకం తో పోలిస్తే 20 రోజులు ముందుగానే పంట కోతకు వస్తుందని స్వర్ణ మసూరి రకానికి బదులుగా ఈ చిరుసంచుల రకం రైతు లు వేసుకోవచ్చని కోరారు .ఎలాంటి తెగుళ్లు,పురుగులు ఆశించలేదని తెలిపారు. సాధారణ ఆర్ జి ఎల్ 7029 రకం తో పోలిస్తే ఎత్తు తక్కువగా ఉంటుందని స్వర్ణ మసూరి రకానికి ఇంచుమించుగా సరిపోతుందని, స్వర్ణ మసూరి రకం సాధారణంగా పాము పొడ తెగులుకు,అగ్గి తెగులుకు దోమపోటుకు గురవుతుందని ఈ చిరు సంచుల కొత్త రకానికి ఎలాంటి తెగుళ్లు ఆశించలేదని జూలై 16న నారు పోసి ఆగస్టు 8న నాట్లు వేసి డిసెంబర్ 9న కోత కోయడం జరిగిందని చెప్పారు.ఈ రకం కోత సమయానికి కూడా పచ్చగా ఉండి గడ్డి పశువుల మేతకు అనుకూలంగా ఉంటుందని కాబట్టి స్వర్ణ మసూరి( ఎం టీ యూ 7029 ) రకానికి బదులుగా రైతులు ఈ చిరు సంచుల ఆర్ జి ఎల్ 7039 రకాన్ని వేసుకుంటే బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఈదిబిల్లి శ్రీను ప్రకృతి సేద్య సిఆర్పి తిరుపతి నాయుడు పాల్గొన్నారు.
