

మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గం 300 కోట్లతో ఇంకా అభివృద్ధి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏలే మల్లికార్జున్ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం.అనంతరంనర్సింగ్ రావుపల్లి చౌరస్తా నుంచి భారీ బైక్ ర్యాలీగా నాయకులు,కార్యకర్తలు మల్లికార్జున్‌ను తీసుకువచ్చి సాయి ఫంక్షన్ హాల్‌లో సమావేశాన్ని నిర్వహించారు. భాజా భజంత్రీలు నృత్యాలతో చేస్తూ సాయి ఫంక్షన్ హాల్ కు చేరుకొని జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..జుక్కల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లుతో జుక్కల్ నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో రోడ్డు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతానన్నారు. డిసిసి పదవి జుక్కల్ నియోజకవర్గం చాలా గొప్ప వరమన్నారు. మల్లికార్జున్ సామాన్య కార్యకర్తగా ఎదిగి డిసిసి పదవిని ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మల్లికార్జున ప్రతి ఒక్క నాయకులతో కలసికట్టుగా పనిచేయాలన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామ గ్రామాన కాంగ్రెస్ కంచుకోటగా ఉండి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మండలాల అధ్యక్షులు మహేందర్ రెడ్డి,రవీందర్ రెడ్డి, నాయకులు అడవికేట్ వెంకట్రాంరెడ్డి, ఎన్ ఆర్ ఐ భాస్కర్ రెడ్డి, సాయి పటేల్, గుర్రపు శ్రీనివాస్, తదితరులు ఉన్నారు








