సమిష్టి శక్తితో గ్రామాభివృద్ధి – గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యం-ఎమ్మెల్యే కాకర్ల..!ఐక్యంగా నడుద్దాం…అభివృద్ధి సాధిద్దాం-ఎమ్మెల్యే కాకర్ల…!
కలిగిరి నవంబర్ 20 మన ధ్యాస న్యూస్://


కలిగిరి మండలంలోని పలు పంచాయతీల్లో గ్రామ కమిటీ కార్యక్రమాల్లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. పోలంపాడు, ఏపీనాపి, రావులకొల్లు, తూర్పు దూబగుంట, చిన్న అన్నలూరు, కృష్ణారెడ్డి పాలెం పంచాయతీల్లో నిర్వహించిన సమావేశాల్లో గ్రామాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని, గ్రామ స్వరాజ్యాన్ని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.సమావేశాల్లో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా భూమి అనుబంధ సమస్యలు మౌలిక వసతుల లోపాలు.సీసీ రోడ్ల ఏర్పాటు,త్రాగునీటి సమస్య,విద్యుత్ సరఫరా అంతరాలు,వంటి అనేక ప్రజావ్యవహార సమస్యలను వివరంగా తెలియజేశారు. ప్రజల వినతులను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే ప్రతి సమస్యకూ త్వరితగతిన పరిష్కారం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.తర్వాత మండల, గ్రామ స్థాయి తెలుగుదేశం నాయకుల సమక్షంలో గ్రామ కమిటీలను క్రమబద్ధంగా ఎంపిక చేసి పార్టీ బలపరిచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ, అభివృద్ధి-పార్టీ బలోపేతం రెండూ సమానంగా కొనసాగాలని ఆయన సందేశం ఇచ్చారు. గ్రామ సందర్శన సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని ఘనంగా ఆహ్వానిస్తూ శాలువాలతో సత్కరించడం ద్వారా తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.

