ఐక్యంగా నడుద్దాం…అభివృద్ధి సాధిద్దాం-ఎమ్మెల్యే కాకర్ల…!
కలిగిరి మండలంలోని పొలంపాడు గ్రామ పంచాయతీ లో స్వయంగా గ్రామ కమిటీల నియామక సమావేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

కలిగిరి నవంబర్ 20 మన ధ్యాస న్యూస్ ://

కలిగిరి మండలంలోని పొలంపాడు గ్రామ పంచాయతీ లో గ్రామ కమిటీ కార్యక్రమాల్లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. పంచాయతీలో నిర్వహించిన సమావేశం గ్రామాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని, గ్రామ స్వరాజ్యాన్ని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.సమావేశాల్లో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా భూమి అనుబంధ సమస్యలు మౌలిక వసతుల లోపాలు.సీసీ రోడ్ల ఏర్పాటు,త్రాగునీటి సమస్య
విద్యుత్ సరఫరా అంతరాలు
వంటి అనేక ప్రజావ్యవహార సమస్యలను వివరంగా తెలియజేశారు. ప్రజల వినతులను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే ప్రతి సమస్యకూ త్వరితగతిన పరిష్కారం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.తర్వాత,మండల మరియు గ్రామ స్థాయి తెలుగుదేశం నాయకుల సమక్షంలో గ్రామ కమిటీలను క్ర‌మ‌బ‌ద్ధంగా ఎంపిక చేసి పార్టీ బలపరిచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ అభివృద్ధి-పార్టీ బలోపేతం రెండూ సమానంగా కొనసాగాలని ఆయన సందేశం ఇచ్చారు. గ్రామ సందర్శన సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని ఘనంగా ఆహ్వానిస్తూ శాలువాలతో సత్కరించడం ద్వారా తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర తెలుగు కార్యనిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు, సర్పంచ్ కల్లూరి రేష్మ, పొలంపాడు గ్రామ సీనియర్ నాయకులు కల్లూరి చంద్రమౌళి, నల్లపనేని సురేష్,కల్లూరి మహేశ్వరరావు,బొల్లినేని శ్రీనివాసులు నాయుడు,దాసర్ల వెంకట్రావు,మారుతీరావు,బూత్ ఇంచార్జి నెలపాటి మజును,సన్నిపోయిన ఈశ్వరయ్య, కడియాల మహేంద్ర,నెలపాటి కొండపనాయుడు,ఉప సర్పంచ్ ఉన్నిమద్దెల తిరుపలు, బూత్ ఇంచార్జి ఉన్నిమద్దెల హజరత్,బాపతి మధుసూదన్ రెడ్డి,నర్రావుల అంకిరెడ్డి, నర్రావుల విరారెడ్డ్,నర్రావుల ఎర్రఅoకిరెడ్డి, టీడీపీ కార్యకర్త కర్రా నాగరాజు, తదితరులు పాల్గొన్నరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *