పుత్తూరు, మన ధ్యాస: సమాజంలో అధికశాతం జబ్బులు కేవలం వ్యక్తిగత మరియు పరిసరాల అపరిశుభ్రత వల్లే వస్తాయని డాక్టర్ పి.రవిరాజు అన్నారు. ప్రతినెలా మూడవ శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు *స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర* కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పుత్తూరులో శనివారం స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా *వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత* అనే అంశం పైన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ పి. రవిరాజు మాట్లాడుతూ మనం పరిశుభ్రంగా ఉండడంతోపాటు ప్రజాస్థలాలను శుభ్రంగా ఉంచడం వల్ల రోగాలు వ్యాప్తిని అరికట్టవచ్చని, అలాగే ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం, కాలుష్యం తగ్గించడం మొదలైన ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. సభాధ్యక్షులు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి చంద్రమౌళి మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా తల వెంట్రుకలను కత్తిరించుకొని, చేతి మరియు కాలిగోళ్లను శుభ్రంగా కత్తిరించుకోవాలని రోజుకు రెండు సార్లు స్నానం చేసి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు… అనంతరం చేతులను శుభ్రం చేసే విషయంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు…. అనంతరం విద్యార్థుల చేత స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కోటేశ్వరయ్య, కన్వీనర్ డాక్టర్ వెంకటకృష్ణయ్య, డాక్టర్ పి. సుజన,NSS అధికారులు డాక్టర్ కే.శ్రీనివాసులు, బాబురావు, మరియు డాక్టర్ వసంత్, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ గాయత్రి, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ పి వరలక్ష్మి తదితర అధ్యాపకులు, మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు, అన్నా గౌరీ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు…








