విశాఖపట్నం నవంబర్ 15 మన ధ్యాస న్యూస్:///

వైజాగ్‌లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఐఐ సమ్మిట్ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ని, అలాగే పరిశ్రమల అభివృద్ధి కార్యకలాపాలకు ప్రముఖమైన పాత్ర పోషిస్తున్న మంత్రివర్యులు టీజీ భరత్ ని, మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధిపై వారితో చర్చించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు అనేక కీలక సంస్కరణలను చేపట్టిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.ముఖ్యమంత్రు ల దూరదృష్టి, పారదర్శక పాలన, పరిశ్రమలకు అనుకూల విధానాలు, అతి తక్కువ సమయంలో అనుమతులు లభించే సింగిల్ విండో విధానం, అలాగే ప్రపంచ ప్రమాణాల మౌలిక వసతుల అభివృద్ధి వంటి చర్యల ఫలితంగా దేశ–విదేశాల నాటి అనేక అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నాయి.ఈ క్రమంలోనే వేల కోట్లు రూపాయల విలువ చేసే పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయనే విషయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెల్లడించారు.ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పరిశ్రమలు స్థాపించబడటం, ఉపాధి అవకాశాలు పెరగడం, యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి రావడం, మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడటం వంటి ప్రయోజనాలు కలుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే ఈ సమావేశంలో ఉదయగిరి నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల విస్తరణ, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల పెంపు వంటి ముఖ్య అంశాలను ఎమ్మెల్యే మంత్రిలకు వివరించారు.ఉదయగిరి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు మా పూర్తి మద్దతు ఉంటుందని మంత్రులు నారా లోకేష్, టి.జి. భరత్ హామీ ఇచ్చారు.నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు.










