ధ్యానం మనిషిని సన్మార్గంలో నడిపించే శక్తివంతమైన సాధన – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!ధ్యానం ద్వారా మానసిక, శారీరక, ఆధ్యాత్మిక వికాసం సాధ్యం – కాకర్ల సురేష్..!
వింజమూరు నవంబర్ 11 మన ధ్యాస న్యూస్ ://

వింజమూరు మండలం పిరమిడ్ నగర్‌లోని వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గురువుగారి జన్మదినోత్సవ వేడుకలు అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ప,త్రీజీ గురువు విశిష్టత, ఆయన చేసిన అపారమైన ఆధ్యాత్మిక సేవలు, ధ్యానం ద్వారా సమాజంలో తీసుకువచ్చిన మార్పులు గురించి వివరించారు. కాకర్ల సురేష్ మాట్లాడుతూ —
“బ్రహ్మర్షి పత్రీజీ మన సమాజానికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహానుభావులు. ఆయన బోధనల ద్వారా ధ్యానం అనే దివ్య సాధనను ప్రతి మనిషి జీవితంలో భాగం చేయాలని సూచించారు. ధ్యానం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుందని, ఆలోచనలు స్పష్టమవుతాయని, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఇది ప్రతి వ్యక్తిని మానసిక, శారీరక, ఆధ్యాత్మిక సన్మార్గంలో ముందుకు నడిపే శక్తివంతమైన సాధన” అని పేర్కొన్నారు. ధ్యానం మనలోని అంతరాత్మను మేల్కొలిపి, లోకహితానికి దారి చూపిస్తుందని, నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ రోజువారీగా కొంత సమయం ధ్యానానికి కేటాయిస్తే, జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది” అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.










