బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ (డి సి పి యు) సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన శుక్రవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా ఉండాలని, మారుమూల ప్రాంతాల ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కోళ్ల ఫామ్స్,ఇటుక బట్టీలు షాపింగ్ మాల్ లో తదితర అన్నిచోట్ల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. మణుగూరులో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ గృహం జిల్లా కేంద్రం కి దూరంగా ఉండటం వలన పర్యవేక్షించడానికి అనువుగా లేదని జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలో బాలల సంరక్షణ గృహం ఏర్పాటుకు ప్రణాళికల రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మణుగూరు లో ఉన్న బాలల సంరక్షణ గృహమును సిడిపిఓ కార్యాలయంగా మార్చాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలోని బాలల సంరక్షణ గృహంలో పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని, సంరక్షణ గృహాలలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై వారంలోగా సమగ్ర నివేదిక అందించాలని వెంటనే సమస్యలు పరిష్కరిస్తాము అన్నారు. సంరక్షణ గృహాలలో పిల్లల ఆరోగ్య పై శ్రద్ధ చూపించాలని, ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యలు పిల్లలకు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పిల్లలకు నెలకి ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థినిల హాజరు పర్యవేక్షించాలని ఎవరైతే పది రోజుల కంటే ఎక్కువ సెలవులు ఉన్నాయో అట్టి విద్యార్థినిలను ఆరోగ్య సమస్య లేదా వివాహం ఏమైనా జరిగిందా అని విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పిల్లల సంరక్షణ చేపట్టాలని, పిల్లల సంరక్షణ మన అందరి బాధ్యత అని ఆయన అన్నారు. జిల్లాలో ఎన్ని పోక్సో కేసులు నమోదయ్యాయి, జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయిలలో నమోదు అయిన కేసుల పూర్తి వివరాలను వారం రోజులలోగా నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నివేదికల ద్వారా ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ పోక్సో కేసు నమోదు అయ్యాయో ఆ ప్రాంతంలో అవగాహన సదస్సులు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ కు వచ్చే ఫిర్యాదుల ను జిల్లా, మండల, గ్రామ స్థాయిలో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు ప్రతి నెల మొదటి వారంలో జిల్లాలోని అన్ని పాఠశాలలు, హాస్టల్స్ ల హెడ్మాస్టర్లు, వార్డెన్ లకు ఫోన్ చేసి పాఠశాలలో ఎవరైనా లైంగిక వేధింపులకు గురి అయ్యారా, ఉపాధ్యాయులు పిల్లలను కొట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారా అని అడిగి,విద్యార్థుల పూర్తి బాధ్యత హెడ్మాస్టర్ లది, హాస్టల్ వార్డెన్ లదే అని స్పష్టం చేయాలన్నారు. ఎవరైనా అటువంటి చర్యలకు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, సిపిఓ సంజీవరావు, మహిళా శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లెనీనా,బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం ఆధ్వర్యంలో నారాయణ పేట జిల్లా పరిదిలోని మక్తల్ పట్టణ కేంద్రంలోని వైష్ణవీ మహిళల జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    మన ధ్యాస,నారాయణ పేట జిల్లా: తెలంగాణ రాబిన్ హుడ్, పేద ప్రజల ఆరాధ్య దైవం పండుగ సాయన్న అని.. సమాజంలో అట్టడుగు వర్గాల కోసం కృషిచేసిన మహనీయుడు పండుగ సాయన్న అని మక్తల్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కోళ్ల వెంకటేష్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.