మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామంలో గాంధీ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని చౌరస్తా వద్ద గాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ మ్యాదరి రామలింగం పూలమాల వేసి నివాళులర్పించారు.మహాత్మా గాంధీ చేసిన త్యాగాలు,దేశ స్వాతంత్ర్య సమరంలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షుడు నాటకరి రాజారాం, యూత్ నాయకుడు కయ్యం సంపత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు సంగమేశ్వర్, మ్యాదరి మహేష్, నాటకరి రమేష్, విఠల్, శ్రీనివాస్, మొగులయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.









